మంత్రి నారాయణను ఇంటర్‌బోర్డు సభ్యునిగా రాష్ట్రప్రభుత్వం తక్షణమే తొలగించాలని సమాజసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య ఆదివారం ఒకప్రకటనలో తెలిపారు.
నందలూరు: మంత్రి నారాయణను ఇంటర్‌బోర్డు సభ్యునిగా రాష్ట్రప్రభుత్వం తక్షణమే తొలగించాలని సమాజసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య ఆదివారం ఒకప్రకటనలో తెలిపారు. మంత్రి నారాయణ తన విద్యాసంస్థల ద్వారా పేదవిద్యార్థుల నుంచి కోట్లాదిరూపాయలను ఫీజుల రూపంలో దోపిడి చేస్తున్న వ్యక్తి అని అతనిని ఇంటర్‌బోర్డు సభ్యునిగా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే 107జీవోను రద్దుచేసి మంత్రి నారాయణను ఇంటర్‌బోర్డు సభ్యునిగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.