ఎంసెట్ నిర్వహణపై సోమవారం అధికారులతో ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు.
విజయవాడ: ఎంసెట్ నిర్వహణపై సోమవారం అధికారులతో ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 29న ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నామనీ, వచ్చే నెల 9న పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.
అయితే వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లోనే అన్ని సెట్ల నిర్వహణ ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు. తెలంగాణలోనూ ఎంసెట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని గంటా చెప్పారు.


