ఏడేళ్ల బాలికపై.. విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొడకండ్లలోని ప్రైమరీ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న బాలిక తల్లిదండ్రు లు గురువారం కూలి పనులకు వెళ్లడంతో ఆమె ఇంటి వద్దే ఉంది. ఈ క్రమంలో మధ్యాహ్నం ఇంటి ఎదురుగా చెట్టు కింద పడుకున్న బాలికపై అ దే వీధికి చెందిన బండారు సోమన్న (16) లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, జరిగిన సంఘటనను బాలిక సాయంత్రం వ
బాలికపై లైంగిక దాడి
Oct 8 2016 12:29 AM | Updated on Sep 4 2017 4:32 PM
కొడకండ్ల : ఏడేళ్ల బాలికపై.. విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొడకండ్లలోని ప్రైమరీ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న బాలిక తల్లిదండ్రు లు గురువారం కూలి పనులకు వెళ్లడంతో ఆమె ఇంటి వద్దే ఉంది. ఈ క్రమంలో మధ్యాహ్నం ఇంటి ఎదురుగా చెట్టు కింద పడుకున్న బాలికపై అ దే వీధికి చెందిన బండారు సోమన్న (16) లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, జరిగిన సంఘటనను బాలిక సాయంత్రం వేళలో తల్లికి వివరించింది. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జనగామ డీఎస్పీ పద్మనాభరెడ్డి.. మహిళా పీఎస్ ఎస్సై రాజ్యలక్షి్మతో శుక్రవారం గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. అనంతరం లైంగికదాడికి పా ల్పడిన సోమన్నపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పాలకుర్తి సీఐ కరుణసాగర్‌రెడ్డి, ఎస్సై ఎంబాడి సత్యనారాయణ, పీఎస్సై రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement