దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు | meeseva applications date extention | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు

Jul 24 2016 11:38 PM | Updated on Oct 16 2018 3:38 PM

జిల్లాలోని 5 వేల జనాభా ఉన్న గ్రామాల్లో కామన్‌ సర్వీసు సెంటర్లు(మీసేవకేంద్రాలు) ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించే గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లుగా జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు.

కర్నూలు(అగ్రికల్చర్‌) : జిల్లాలోని 5 వేల జనాభా ఉన్న గ్రామాల్లో కామన్‌ సర్వీసు సెంటర్లు(మీసేవకేంద్రాలు) ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించే గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లుగా  జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు. తగిన ఆర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి  దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ గవర్నెన్స్‌ పాలనలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో మీసేవ కేంద్ర తరహాలో కామన్‌ సర్వీస్‌సెంటర్లు ఏర్పాటు కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇది వరకే మీసేవ కేంద్రాలు ఉన్న పంచాయతీలను మినాహాయించి మిగిలిన పంచాయతీల్లో  కామన్‌ సర్వీస్‌ సెంటర్లు  ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణులయి, కంప్యూటర్‌ డిప్లమో కలిగి తెలుగు, ఇంగ్లిషులలో చదవడం, రాయడం వచ్చిన వారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాల, దరఖాస్తులు చేసుకునేందుకు  WWW.ESEVA.AP.GOV.IN, WWW.AP.MEESEVA.GOV.IN, WWW.APIT.AP.GOV.IN, WWW.ONLINEAP.MEESEVA.GOV.IN, WWW.MEESEVAONLINEAP.IN, WWW.KURNOOL.AP.GOV.IN వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement