ఏడీసీ తనిఖీల్లో మెడికల్‌ స్టోర్ల మూసివేత | medical stores bundh in hindupur | Sakshi
Sakshi News home page

ఏడీసీ తనిఖీల్లో మెడికల్‌ స్టోర్ల మూసివేత

Jul 5 2017 11:04 PM | Updated on Oct 9 2018 7:52 PM

ఏడీసీ తనిఖీల్లో మెడికల్‌ స్టోర్ల మూసివేత - Sakshi

ఏడీసీ తనిఖీల్లో మెడికల్‌ స్టోర్ల మూసివేత

పట్టణంలోని మెడికల్‌ స్టోర్లను బుధవారం అనంతపురం ఏడీసీ (అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌) అధికారులు తనిఖీ చేపట్టడంతో మెడికల్‌ దుకాణాలన్నీ ఒక్కసారిగా మూతపడ్డాయి.

హిందూపురం అర్బన్‌ : పట్టణంలోని మెడికల్‌ స్టోర్లను బుధవారం అనంతపురం ఏడీసీ (అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌) అధికారులు తనిఖీ చేపట్టడంతో మెడికల్‌ దుకాణాలన్నీ ఒక్కసారిగా మూతపడ్డాయి. ఉదయం అధికారులు ప్రధాన రహదారిలోని రెండు మెడికల్‌ దుకాణాల్లో తనిఖీలు చేసి సేల్స్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో రెండుషాపులకు నోటీసులు పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న మిగిలిన దుకాణాదారులంతా సాయంత్రం వరకు షాపులు మూసివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు వెంటనే విక్రయాలకు సంబంధించిన వివరాలన్నీ చూపాలంటే ఇబ్బంది కలుగుతుందని దుకాణదారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement