ఫేస్‌బుక్‌లో బుక్కాయ్యారు | Marping Photos on Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో బుక్కాయ్యారు

Mar 6 2016 1:57 AM | Updated on Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్‌లో బుక్కాయ్యారు - Sakshi

ఫేస్‌బుక్‌లో బుక్కాయ్యారు

ఫేస్‌బుక్‌లో మార్పింగ్ ఫొటోలు పెట్టిన ఇద్దరు యువకులు అడ్డంగా బుక్కయ్యారు.

శాంతిపురం: ఫేస్‌బుక్‌లో మార్పింగ్ ఫొటోలు పెట్టిన ఇద్దరు యువకులు అడ్డంగా బుక్కయ్యారు. మండలంలోని మొరసనపల్లిలో బంధువుల ఇంటికి వచ్చిన ఓ అమ్మాయిని అదే గ్రామానికి చెందిన యువకుడు తన ఫోన్‌లో ఫొటో తీశాడు. మిత్రుడి ఫొటోతో ఆ అమ్మాయి ఫొటోను కలిపి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. కానీ తమ ఇంటికి వచ్చిన అమ్మాయి ఫొటో మార్పింగ్‌తో ఫేస్‌బుక్‌లో ఉండడం ఆ అమ్మాయి బంధువైన వురో యువకుడు గమనించి, పెద్దలకు తెలిపాడు.

ఇలా ఎవరు చేశారనేది కనుక్కున్నారు. అంతటితో ఆగకుండా నిందితుడి చెల్లెలి ఫొటో తీసి మరో వ్యక్తి ఫొటోతో కలిపి మార్పింగ్ చేశాడు. తనకు పరిచయం ఉన్న మరొకరి ఫేస్‌బుక్ ఖాతా నుంచి దానిని అప్‌లోడ్ చేశాడు. అప్పటికే ఒక ఫొటోతో సాగుతున్న వివాదం రెండవ ఫొటోతో తారాస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం ఇరు వర్గాల వారూ గొడవకు దిగారు.  కలగజేసుకున్న స్థానికులు ఇరు వర్గాలనూ శాంతిపజేసి ఆదివారం గ్రామంలో పంచాయితీ జరపాలని తీర్మానించారు. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లలేదు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement