మార్కెట్‌యార్డు బడ్జెట్‌పై సమీక్ష | Market Yard Budget Review | Sakshi
Sakshi News home page

మార్కెట్‌యార్డు బడ్జెట్‌పై సమీక్ష

Apr 10 2017 11:23 PM | Updated on Jun 1 2018 8:39 PM

మార్కెట్‌యార్డుల ఆదాయ, వ్యయాలకు సంబంధించి 2017–18 బడ్జెట్‌ రూపకల్పనపై అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన మార్కెట్‌యార్డుల సెక్రటరీలతో మార్కెటింగ్‌శాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్జేడీ), కమిషనరేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అనసూయమ్మ సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతపురం అగ్రికల్చర్‌: మార్కెట్‌యార్డుల ఆదాయ, వ్యయాలకు సంబంధించి 2017–18 బడ్జెట్‌ రూపకల్పనపై అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన మార్కెట్‌యార్డుల సెక్రటరీలతో మార్కెటింగ్‌శాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్జేడీ), కమిషనరేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అనసూయమ్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం స్థానిక మార్కెటింగ్‌శాఖ ఏడీ బి.హిమశైల కార్యాలయంలో అంతర్గత సమావేశంలో కర్నూలు ఏడీ, 25 మంది సెక్రటరీలు హాజరయ్యారు. గతేడాది రెండు జిల్లాల్లోనూ వసూళ్లు గణనీయంగా తగ్గిపోవడంతో ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. త్వరలోనే మరోసారి కమిషనరేట్‌ బృందం జిల్లాలో పర్యటించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యార్డుల వారిగా లక్ష్య నిర్ధేశన చేయనున్నారని ఏడీఎం హిమశైల తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement