మావోయిస్టుల లేఖ కలకలం | maoists letter found in vishakhapatnam | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల లేఖ కలకలం

Feb 28 2016 7:07 PM | Updated on Oct 9 2018 2:51 PM

ఆంధ్రప్రదేశ్, ఒడిషాలలో సెక్స్ రాకెట్, అత్యాచారాలు పెరిగిపోయాయని పేర్కొంటు మావోయిస్టులు రాసిన లేఖ జిల్లాలోని పెదబయలులో కలకలం సృష్టించింది.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, ఒడిషాలలో సెక్స్ రాకెట్, అత్యాచారాలు పెరిగిపోయాయని పేర్కొంటూ.. మావోయిస్టులు రాసిన లేఖ జిల్లాలోని పెదబయలులో కలకలం సృష్టించింది. కేంద్రలోని బీజేపీ, ఒడిషాలోని బిజూ జనతా దళ్, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని మోవోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. మల్కాజ్గిరి- విశాఖ- కోరాపుట్ బోర్డర్ రీజనల్ కమిటీ పేరుతో వెలువడిన ఈ లేఖలో మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మహిళలు గ్రామగ్రామాన ప్రతిఙ్ఞ చేయాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement