ప్రేయసిని గోదావరిలోకి తోసేసిన ప్రియుడు | Man try to kill his girlfriend in east godavari district | Sakshi
Sakshi News home page

ప్రేయసిని గోదావరిలోకి తోసేసిన ప్రియుడు

Jun 5 2017 9:38 AM | Updated on Sep 5 2017 12:53 PM

ప్రేయసిని గోదావరిలోకి తోసేసిన ప్రియుడు

ప్రేయసిని గోదావరిలోకి తోసేసిన ప్రియుడు

ప్రేమకథకు పెళ్లితో సుఖాంతం పలుకుదాం అని అడిగినందుకు ప్రేయసిని గోదావరి నదిలోకి తోసేశాడు ఓ ప్రేమికుడు

కాకినాడ : వారు ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. మన ప్రేమకథకు పెళ్లితో సుఖాంతం పలుకుదాం అని అడిగినందుకు ప్రేయసిని గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు ఆ ప్రేమికుడు. ఈ ఘటన పాండిచ్చేరి పరిధిలోని యానాంలో చోటుచేసుకుంది.

స్థానికులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన గండి అలివేణి(26) రాజమండ్రి గ్యాస్ అధారిటీ ఆప్ ఇండియా(గెయిల్)లో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస‍్తోంది.  ఎస్.యానంకు చెందిన  శ్రీనివాసరావు రాజమండ్రిలోని బట్టలషాపులో పనిచేసేవాడు. ఇద‍్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. గత కొంతకాలంగా పెళ్లిచేసుకోమని అలివేణి శ్రీనివాస్‌ను కోరుతోంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌ ఆదివారం రాత్రి  యానాం వెళ‍్లాడు. వారు యానాం-ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారధిపై కొద్దిసేపు గడిపారు. సోమవారం వేకువజామున పెళ్లి విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ప్రియుడు ఆమె తలపై మోది, గొంతు నులిమి వంతెనపై నుంచి గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు. అనంతరం ఆమె సెల్‌ఫోన్‌, హ్యాండ్‌బ్యాగ్‌ తీసుకుని పరారయ్యాడు. గమనించిన స్థానిక మత్స్యకారులు అలివేణిని రక్షించి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఐ.పోలవరం ఎస్సై వి.శివకుమార్‌ ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement