ప్రేమించిన అమ్మాయి దక్కలేదని... | man suicides in anantapur | Sakshi
Sakshi News home page

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని...

Apr 24 2017 12:34 AM | Updated on Aug 29 2018 8:38 PM

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్లి కావడంతో మనస్తాపానికి గురైన ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అనంతపురం సెంట్రల్‌ : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్లి కావడంతో మనస్తాపానికి గురైన ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం రామకృష్ణ కాలనీలో ఆదివారం జరిగింది. వన్‌టౌన్‌ సీఐ రాఘవన్‌ కథనం మేరకు... కాలనీకి చెందిన శివకృష్ణ(24) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి లేరు. తల్లి లక్ష్మీ కువైట్‌లో ఉంటున్నారు. దీంతో అతనొక్కడే రామకృష్ణ కాలనీలో ఉంటూ కూలీ పనులకు వెళ్లేవాడు. 

బంధువులకు చెందిన ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. అయితే ఆమె తల్లిదండ్రులు మరో యువకుడికిచ్చి పెళ్లి చేయడంతో తట్టుకోలేకపోయాడు. మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి తనువు చాలించాడు. చుట్టుపక్కల వారు గమనించి కువైట్‌లో ఉంటున్న అతని తల్లికి ఫోన్‌లో సమాచారం తెలిపారు. పోలీసుల దృష్టికీ తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement