సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టిక్కెట్ ఇవ్వలేదని ... | man suicide attempts in adilabad district | Sakshi
Sakshi News home page

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టిక్కెట్ ఇవ్వలేదని ...

Apr 8 2016 8:34 AM | Updated on Aug 17 2018 8:03 PM

ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల శ్రీనివాస్ థియేటర్ ఎదుట శుక్రవారం తమ్మయ్య అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల శ్రీనివాస్ థియేటర్ ఎదుట శుక్రవారం తమ్మయ్య అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టిక్కెట్లు థియేటర్ యాజమాన్యం తనకు ఇవ్వలేదని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు.

దీంతో థియేటర్ వద్ద ఉన్న వారు వెంటనే స్పందించి... సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ్మయ్య అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడని స్థానికులు చెబుతున్నారు. మరింత సమాచారం అందవలసి ఉంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement