వ్యక్తి ఆత్మహత్య | man suicide | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Mar 22 2017 9:24 PM | Updated on Nov 6 2018 7:53 PM

మండల పరిధిలోని టి.సోమలగూడూరు గ్రామానికి చెందిన నరసింహులు(48) అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్‌ బుధవారం విలేకరులకు తెలిపారు.

- మురుగు కాలువ విషయంలో గొడవ
నందవరం: మండల పరిధిలోని టి.సోమలగూడూరు గ్రామానికి చెందిన నరసింహులు(48) అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్‌ బుధవారం విలేకరులకు తెలిపారు. అదే గ్రామానికి చెందిన శీను, పెద్దయ్య,  మల్లన్న, నరసింహులు మధ్య మురుగు కాలువ నీటి విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. నిందితులు.. నరసింహులును నానాదుర్బాషలాడడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. పురుగు మందు తాగడంతో గమనించిన స్థానికులు  చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూమృతి చెందాడు. కుమారుడు శ్రీరాములు ఫిర్యాదు మేరకు ముగ్గురి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement