ర్మపురి : మండలంలోని రాయపట్నం వద్ద గోదావరి వంతెన పైనుంచి నదిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వంతెనపై బుధవారం అతడి బైక్, చెప్పులు కనిపించడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానించారు.
గోదావరిలో దూకి వ్యక్తి మృతి
Sep 22 2016 9:54 PM | Updated on Sep 4 2017 2:32 PM
ధర్మపురి : మండలంలోని రాయపట్నం వద్ద గోదావరి వంతెన పైనుంచి నదిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వంతెనపై బుధవారం అతడి బైక్, చెప్పులు కనిపించడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానించారు. అదే నిజమైంది. గురువారం మృతదేహం లభించింది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా పాత మంచిర్యాలకు చెందిన కుమ్మరికుంఠ తిరుపతి(38) మంగళవారం అర్ధరాత్రి రాయపట్నం వంతెన పైనుంచి నదిలో దూకాడు. బుధవారం ఉదయం వంతెన పైన తిరుపతికి సంబంధించిన ద్విచక్రవాహనం, చెప్పులు కనిపించడంతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానించారు. జాలర్ల సహాయంతో రోజంతా గాలించారు. ఆచూకి తెలియరాలేదు. గురువారం తిరుపతి శవమై తేలాడు. దీంతో బంధువులు బోరున విలపించారు. మనోవేదనతోనే తిరుపతి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తిరుపతికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
Advertisement


