ప్రజావాణిలో గొంతు కోసుకున్న వ్యక్తి | man sucide attempt at collectrate | Sakshi
Sakshi News home page

ప్రజావాణిలో గొంతు కోసుకున్న వ్యక్తి

Aug 8 2016 11:11 PM | Updated on Oct 9 2018 5:39 PM

ప్రజావాణిలో గొంతు కోసుకున్న వ్యక్తి - Sakshi

ప్రజావాణిలో గొంతు కోసుకున్న వ్యక్తి

కాకినాడ సిటీ : కలెక్టరేట్‌లో జరుగుతున్న ప్రజావాణి వద్ద సోమవారం ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అమలాపురం మండ లం నడిపూడి గ్రా మం మెట్లకాలనీకి చెందిన కుడిపూడి సాయిబాబా భూసమస్య పరిష్కారం కోరు తూ కలెక్టరేట్‌ ప్రజావాణిలో అర్జీ అందజేసి, రసీదు తీసుకున్నాడు. ఇప్పటికే రెం డుసార్లు అర్జీ ఇచ్చినా పరిష్కారం కాకపో గా, మరలా తహసీల్దార్‌కు సిఫారసు చేస్తూ

సమస్య పరిష్కారం కాకపోవడం వల్లేనని ఆవేదన
కాకినాడ సిటీ : కలెక్టరేట్‌లో జరుగుతున్న ప్రజావాణి వద్ద సోమవారం ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అమలాపురం మండ లం నడిపూడి గ్రా మం మెట్లకాలనీకి చెందిన కుడిపూడి సాయిబాబా భూసమస్య పరిష్కారం కోరు తూ కలెక్టరేట్‌ ప్రజావాణిలో అర్జీ అందజేసి, రసీదు తీసుకున్నాడు. ఇప్పటికే రెం డుసార్లు అర్జీ ఇచ్చినా పరిష్కారం కాకపో గా, మరలా తహసీల్దార్‌కు సిఫారసు చేస్తూ రసీదు ఇవ్వడంతో, ఇక సమస్య పరిష్కా రం కాదని ఆందోళన చెంది ప్రజావాణి ఆవరణలోనే బ్లేడుతో గొంతు కోసుకున్నా డు. దీంతో అక్కడ అలజడి చేలరేగింది. సిబ్బంది 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడికి ప్రాణాపాయం లేదని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.
కుమార్తెకు పట్టా మంజూరు చేయాలని..
నడిపూడి మెట్లకాలనీలోని తన ఇంటికి ఆనుకుని ఉన్న పీడబ్ల్యూడీకి చెందిన సెంటు భూమిని కుమార్తె పేరున పట్టా మంజూరు చేయాలని కోరుతూ సాయిబాబా అధికారుల చుట్టూ మూడు నెల లుగా తిరుగుతున్నాడు. మండల స్థాయిలో పట్టించుకోకపోగా, వేరొకరి వద్ద అధికారులు సొమ్ము తీసుకుని పట్టా మంజూరు చేశారని ఆయన ఆరోపించాడు. తాను ఎప్పటి నుంచో పీడబ్ల్యూడీకి చెందిన సెం టు భూమిలో అరటి, కొబ్బరి మొక్కలు పెంచుకుంటున్నానని తెలిపాడు. కలెక్టరేట్‌ ప్రజావాణిలో ఇప్పటికి మూడుసార్లు అర్జీ ఇచ్చినా, సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
పునరావృతమవుతున్న ఘటనలు
ప్రతివారం మండల, జిల్లా స్థాయిల్లో జరిగే ప్రజావాణిలో అర్జీలకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించక అర్జీదారులు పదేపదే తిరుగుతూ విసిగిపోతున్నారు. జూన్‌ 13న పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన వృద్ధురాలు.. అకారణంగా తన పింఛను నిలిపివేశారని, దానిని పునరుద్ధరించాలని కోరుతూ కలెక్టరేట్‌ ప్రజావాణికి వచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. అర్జీల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యవైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement