నా పొలంలో మేత మేస్తావా..
మామిడి తోటలో ఆవు మేత మేసిందని దానిని కొ్టి చంపాడో ప్రబుద్ధుడు.
హొసూరు: మామిడి తోటలో ఆవు మేత మేసిందని దానిని కొ్టి చంపాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన చంబరసనపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన చంద్రన్ సూళగిరిలో మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతనికి చంబరసనపల్లిలో మామిడి తోట ఉంది. ఈ తోటలో రెండు ఆవులు, రెండు గొర్రెలు మేత మేస్తుండగా పొలం వద్దకు వచ్చిన చంద్రన్ గొర్రెలను, పశువులను తాళ్లు తెంచి వెళ్లగొట్టాడు. ఒక ఆవును తాడుతో కడుపు పై బాదాడు. గర్భంతోవున్న ఆవు అతను కొట్టిన దెబ్బలకు మరణించింది. జీవనోపాధికి పశుపోషణ చేసుకుంటున్న లక్ష్మీ తన ఆవును చంపేశాడని బోరున విలపించింది. చంబరసనపల్లి గ్రామంలో ఈ సంఘటనపై ఇరువర్గాలుగా ఏర్పడి కేసు పెట్టాలని సూళగిరి పోలీస్‌స్టేషన్‌కు బాధితురాలిని తీసుకొచ్చారు.