బైక్ ఢీకొని స్టీల్ప్లాంట్ ఉద్యోగి మృతి | man killed in road accident in vizag city | Sakshi
Sakshi News home page

బైక్ ఢీకొని స్టీల్ప్లాంట్ ఉద్యోగి మృతి

Aug 6 2016 9:30 AM | Updated on Aug 30 2018 4:07 PM

విశాఖపట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్టీల్ప్లాంట్ ఉద్యోగి ఒకరు చనిపోయారు.

విశాఖపట్టణం: విశాఖపట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్టీల్ప్లాంట్ ఉద్యోగి ఒకరు చనిపోయారు. స్టీల్ప్లాంట్‌లో పనిచేసే వెంకటపతిరాజు విధుల నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా ఆటోనగర్ సిగ్నల్ పాయింట్ వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటపతిరాజు తలకు తీవ్ర గాయాలై... అక్కడికక్కడే మరణించాడు. మరో బైక్‌పై ఉన్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన  స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement