లక్ష్మీపేటలో వ్యక్తి తుపాకీతో హల్చల్ | Man hulchul with pistol in lakshmipeta in visakhapatnam | Sakshi
Sakshi News home page

లక్ష్మీపేటలో వ్యక్తి తుపాకీతో హల్చల్

Aug 10 2015 8:57 AM | Updated on Oct 9 2018 5:39 PM

విశాఖపట్నం జిల్లా పెద్దబయిలు మండలం లక్ష్మీపేటలో ఓ వ్యక్తి సోమవారం తుపాకీతో హల్చల్ చేశాడు.

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పెద్దబయిలు మండలం లక్ష్మీపేటలో ఓ వ్యక్తి సోమవారం తుపాకీతో హల్చల్ చేశాడు. దాంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. గ్రామస్థులంతా సదరు వ్యక్తిని బంధించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లక్ష్మీపేటకు చేరుకున్నారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం అతడిని విచారిస్తుండగా.... అక్కడి నుంచి పరారైయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు, గ్రామస్థులు ప్రయత్నించారు. కానీ అతడు అప్పటికే పరారైయ్యాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement