మద్యం మత్తులో ఉరేసుకున్నాడు | Man hanging himself in karimnagar district | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ఉరేసుకున్నాడు

Aug 15 2015 8:18 PM | Updated on Sep 3 2017 7:30 AM

కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన తన్నీరు మహేందర్ (30) అనే యువకుడు మద్యం మత్తులో శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన తన్నీరు మహేందర్ (30) అనే యువకుడు మద్యం మత్తులో శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానిస అయిన మహేందర్ ఇంట్లో కుటుంబ సభ్యులు  లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా మహేందర్ ఉరి వేసుకున్నాడు. దాంతో అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మద్యానికి బానిస అయిన మహేందర్ కుటుంబ పోషణను పట్టించుకోకుండా ఉండేవాడని గ్రామస్థులు వెల్లడించారు.

మద్యం మత్తులోనే అతడు ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారని చెప్పారు. మహేందర్  భార్య భారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement