రైలు నుంచి జారిపడి యువకుడి మృతి | man dies train accident | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

Apr 9 2017 11:03 PM | Updated on Sep 5 2017 8:22 AM

కొత్తచెరువు సమీపంలోని గండి వద్ద రైలు నుంచి జారి పడి ఓ యువకుడు మృతి చెందాడు.

కొత్తచెరువు : కొత్తచెరువు సమీపంలోని గండి వద్ద రైలు నుంచి జారి పడి ఓ యువకుడు మృతి చెందాడు. కొత్తచెరువు ఎమ్మార్సీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న మండల కేంద్రానికి చెందిన నాగార్జున(33)గా గుర్తించారు. అనంతపురం నుంచి శనివారం రాత్రి కొత్తచెరువుకు రైలులో వస్తూ ప్రమాదవశాత్తు జారిపడినట్లు పోలీసులు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయమే గొర్రెల కాపరులు గుర్తించి తమకు సమాచారం ఇచ్చారని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement