గుట్కా వేసుకుని ఈతకు వెళ్లడంతో.. | man died while swimming along with chewing gutka | Sakshi
Sakshi News home page

గుట్కా వేసుకుని ఈతకు వెళ్లడంతో..

Sep 6 2016 10:06 PM | Updated on Sep 17 2018 8:02 PM

గుట్కా వేసుకుని ఈతకు వెళ్లడంతో.. - Sakshi

గుట్కా వేసుకుని ఈతకు వెళ్లడంతో..

రాజేంద్రనగర్‌ చెరువులో ఈతకోడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయి ఓ యువకుడు మృతి

అత్తాపూర్‌: చెరువులో ఈతకోడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఉమెందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్రనగర్‌కు చెందిన మురళీ(28) కుమార్‌(27), స్నేహితులు. సోమవారం స్థానిక పత్తికుంట చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. గుట్కాతినే అలవాటు ఉన్న మురళీ నోట్లో గుట్కాపెట్టుకోని నీటిలోకి దిగి ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందాడు. రాజేంద్రనగర్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement