అది రోడ్డు ప్రమాదం కాదు.. హత్య! | man died in accident relatives said its not a accident | Sakshi
Sakshi News home page

అది రోడ్డు ప్రమాదం కాదు.. హత్య!

Jul 18 2017 2:28 AM | Updated on Aug 30 2018 4:10 PM

అది రోడ్డు ప్రమాదం కాదు.. హత్య! - Sakshi

అది రోడ్డు ప్రమాదం కాదు.. హత్య!

వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పలు రకాల వదంంతులు విన్పిస్తున్నాయి.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఘటనపై పలు అనుమానాలు
హత్యకు గురయ్యాడన్న సమాచారంతో ఆ కోణంలో విచారణ
పోలీసుల అదుపులో ఐదుగురు తండావాసులు!


బొల్లాపల్లి (వినుకొండ) : వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పలు రకాల వదంంతులు విన్పిస్తున్నాయి. మండలంలోని కనుమలచెర్వు పంచాయతీ శివారు బ్రిడ్జి తండాలో ఈ నెల 11న ఉదయం గుర్తు తెలియని ఆటో డీకొని భూక్యా రూప్లానాయక్‌ (42) మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బండ్లమోటు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో ఇటీవల పోలీసులకు అజ్ఞాత వ్వక్తి ఫోన్‌ చేసి రూప్లానాయక్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని, హత్యకు గురయ్యాడని సమాచారం అందజేసినట్లు మండలంలో పుకార్లు విన్పిస్తున్నాయి.

దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా బ్రిడ్జితండాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. మృతుడి కుటుంబ సభ్యులు సైతం రూప్లానాయక్‌ హత్య చేయబడ్డాడని పోలీసుల వద్ద వాపోయారని తెలుస్తోంది. కేసు కొత్త మలుపు తిరగడంతో ఈ ఘటన తండాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై బండ్లమోటు ఎస్సై ఎంవీ చరణ్‌ను వివరణ కోరగా ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దాంతో అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement