
ప్రకాశం బ్యారేజీలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య
ప్రకాశం బ్యారేజీలోకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
విజయవాడ: ప్రకాశం బ్యారేజీలోకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకోగా.. సోమవారం మధ్యాహ్నానికి ఆయన మృతదేహం బ్యారేజీ 4వ పిల్లర్ వద్ద బయటికి తేలింది.
మృతుడు నగరంలోని రాజరాజేశ్వరీపేటకు చెందిన రమణగా గుర్తించారు. రమణ కార్పెంటర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.