మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్టు | Malladi Vishnu and his brother arrested in adulterated liquor case | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్టు

Jan 8 2016 3:51 AM | Updated on Aug 17 2018 5:07 PM

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్టు - Sakshi

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్టు

కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే, విజయవాడ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు, ఆయన సోదరుడు మల్లాది శ్రీనివాస్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయవాడ సిటీ: కల్తీ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, అతని తమ్ముడు మల్లాది శ్రీనివాస్(బుల్లియ్య)లను గురువారం రాత్రి 11.20 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు. విష్ణును బుధవారం దాదాపు 12.30 గంటలపాటు విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు గురువారం కూడా విచారించారు. బార్ లెసైన్స్‌దారుల్లో విష్ణు తల్లి త్రిపురసుందరమ్మ మినహా భాగవతుల శరశ్చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కె.ఎ.లక్ష్మిని కూడా పిలిపించిన  విచారణ అధికారులు.. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లోని ప్రత్యేక గదిలో విష్ణుతోపాటు మిగిలినవారిని ఎదురెదురుగా పెట్టి విచారించారు.

సిట్ అధినేత మహేష్ చంద్ర లడ్హా ఆధ్వర్యంలోని అధికారుల బృందం వీరినుంచి పలు వివరాలనడిగి తెలుసుకుంది. తొలిరోజు విచారణలో చెప్పిన అంశాల్నే విష్ణు పునరుద్ఘాటించినట్టు సమాచారం. లెసైన్స్‌దారులు చెపుతున్న విషయాలతో పోల్చినప్పుడు విష్ణు చెప్పిన సమాధానాలు కొంత విరుద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో  విష్ణును, ఆయన తమ్ముడు శ్రీనివాస్‌లను అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement