ఎస్సీ వర్గీకరణ కోసం నవంబర్ 20న నిర్వహించనున్న మాదిగ ధర్మ యుద్ధ మహాసభకు మాదిగలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపాక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.
మహాసభను విజయవంతం చేయాలి
Sep 1 2016 1:21 AM | Updated on Sep 15 2018 2:27 PM
నడిగూడెం : ఎస్సీ వర్గీకరణ కోసం నవంబర్ 20న నిర్వహించనున్న మాదిగ ధర్మ యుద్ధ మహాసభకు మాదిగలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపాక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం మండలం కేంద్రానికి చెందిన ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దున్నా శ్యామ్ ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరైన ఆయన అనంతరం దళిత కాలనీలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ వర్గీకరణ జరిగితే 59 మాదిగ ఉపకులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దున్నా శ్యామ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి చింత జాన్ విల్సన్, ఎమ్మార్పీఎస్ నాయకులు పాతకొట్ల శ్రీనివాస్, గంటెపంగు విజయ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement