జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు శనివారం నిర్వహించారు. 52 రోజులకు ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.17,06,268 లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు.
మద్ది ఆలయ హుండీ ఆదాయం రూ.17 లక్షలు
Oct 29 2016 9:52 PM | Updated on Sep 27 2018 4:42 PM
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు శనివారం నిర్వహించారు. 52 రోజులకు ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.17,06,268 లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. నోట్ల రూపంలో రూ.15,78,406, నాణేల రూపంలో రూ.1,27,862, 3 విదేశీ కరెన్సీలు లభించాయి. కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయ ఈవో యాళ్ల శ్రీథర్ పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ సిబ్బంది, నోవా విద్యార్థులు, కరూర్ వైశ్యాబ్యాంక్ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
Advertisement
Advertisement