రాయినిగూడెం వద్ద లారీ బోల్తా
రాయినిగూడెం(సూర్యాపేటరూరల్):
అదుపుతప్పి నాకౌట్ కంపెనీకి చెందిన బీర్ల లోడ్‌తో వెళ్తున్న లారీబోల్తా పడింది.
రాయినిగూడెం(సూర్యాపేటరూరల్):
అదుపుతప్పి నాకౌట్ కంపెనీకి చెందిన బీర్ల లోడ్‌తో వెళ్తున్న లారీబోల్తా పడింది. ఈ ఘటన సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సూర్యాపేటరూరల్ ఎస్‌ఐ జి.శ్రీనువాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో నాకౌట్‌కంపెనీకి చెందిన 1250 కాటన్ల బీర్లను లోడ్ చేసుకుని విజయవాడకు వెళ్తున్న లారీ తెల్లవారుజామున రాయినిగూడెం సమీపంలోకి రాగానే అదుపుతప్పి సర్వీస్‌రోడ్డు మీద బోల్తా పడింది. దీంతో బీరు సీసాలు చాలా వరకు పగిలిపోయాయి. డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. గ్రామస్తులు బీరు కాటన్‌లు ఎత్తుకుపోకుండా పోలీసులు లారీ వద్ద కాపలా ఉన్నారు.