గొర్రెలను తరలిస్తున్న లారీల సీజ్‌ | lories seaz of sheep transfer | Sakshi
Sakshi News home page

గొర్రెలను తరలిస్తున్న లారీల సీజ్‌

May 17 2017 11:50 PM | Updated on Sep 5 2017 11:22 AM

గొర్రెలను తరలిస్తున్న లారీల సీజ్‌

గొర్రెలను తరలిస్తున్న లారీల సీజ్‌

ధర్మవరం ప్రాంతం నుంచి గొర్రెలతో వెళ్తున్న ఆరు లారీలను చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టులో పెనుకొండ ఆర్టీఓ మురళీ ఆధ్వర్యంలో అధికారులు బుధవారం సీజ్‌ చేశారు.

చిలమత్తూరు (హిందూపురం) : ధర్మవరం ప్రాంతం నుంచి గొర్రెలతో వెళ్తున్న ఆరు లారీలను చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టులో పెనుకొండ ఆర్టీఓ మురళీ ఆధ్వర్యంలో అధికారులు బుధవారం సీజ్‌ చేశారు. రికార్డులు, లైసెన్సులు తదితర అనుమతి పత్రాలు సక్రమంగా లేని కారణంతో పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో సక్రమంగా రికార్డులు ఉన్న లారీలను వదిలేశామన్నారు. డ్రైవర్‌ లైసెన్సు తదితర పత్రాలు లేని రెండు లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అపరాధ రుసుం చెల్లించి లారీలను తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. కాగా తమకు ఇలాంటి నిబంధనలు తెలియవని, పశుగ్రాసం కోసం ధర్మవరం మండలం రావులచెరువు నుంచి ఆరు లారీలను మాట్లాడుకుని కర్ణాటకలోని చిక్‌బళ్లాపురం సమీప గ్రామాలకు వెళ్తున్నామని గొర్రెల పెంపకందారుడు రామాంజి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎండకు లారీల్లోని గొర్రెలు విలవిల్లాడటంతో పెంపకందారులు చూడలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement