మద్దిలపాలెం బాబా రీడింగ్ రూమ్‌లో ఓపెన్ చెస్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి.
ఉత్సాహంగా చదరంగం పోటీలు
Aug 6 2016 11:43 PM | Updated on May 3 2018 3:20 PM
విశాఖపట్నం: మద్దిలపాలెం బాబా రీడింగ్ రూమ్‌లో ఓపెన్ చెస్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఎఎంఆర్ ఓపెన్ చెస్ పేరిట ఈ టోర్నిలో ఏడు రౌండ్ల పాటు పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలకు ఇరవైవేల నగదును పంచనుండగా తొలిరోజు శనివారం మూడు రౌండ్ల పోటీలు జరిగాయి. ఓపెన్ కాటగిరిలోనే ఏడు రౌండ్ల పాటు తలపడనున్నా కాటగిరిల వారీగా తొలి రెండు స్దానాల్లో నిలిచిన వారికి నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. అండర్ 10,13,16 కాటగిరిలతో పాటు వుమెన్‌లోనూ తొలి రెండు స్దానాల్లో నిలిచిన వారితో పాటు టోర్నిలో తలపడుతున్న యంగేస్ట్ ప్లేయర్‌తో పాటు వెటరన్, ప్రత్యేక తరగతిలోనూ ఒకరికి బహుమతి అందించనున్నారు.
Advertisement
Advertisement