'..లేదంటే మద్యం సరఫరా నిలిపివేస్తాం' | liquor supply will stop, if would not resigsterd | Sakshi
Sakshi News home page

'..లేదంటే మద్యం సరఫరా నిలిపివేస్తాం'

Feb 15 2016 3:56 PM | Updated on Sep 3 2017 5:42 PM

'..లేదంటే మద్యం సరఫరా నిలిపివేస్తాం'

'..లేదంటే మద్యం సరఫరా నిలిపివేస్తాం'

ఎక్సైజ్‌ శాఖకు గత నెల జనవరి వరకు వ్యాట్‌ సహా రూ. 10, 270 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్‌ కమిషనర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా వెల్లడించారు.

విశాఖ: ఎక్సైజ్‌ శాఖకు గత నెల జనవరి వరకు వ్యాట్‌ సహా రూ. 10, 270 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్‌ కమిషనర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. మార్చి నాటికి రూ. 12, 500 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలనేది తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. సోమవారం ముఖేష్‌ మీనా విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో నాటు సారా నియంత్రణలో ఉందని చెప్పారు. ఇంకా మూడు, నాలుగు జిల్లాల్లో నియంత్రణ కావాల్సి ఉందని అన్నారు.

రెండు వేల మంది నాటుసారా అమ్మకందారులపై బైండోవర్లు కేసులు నమోదు చేశామన్నారు. మరో 2, 800 మందిపై బైండోవర్లు చేయాల్సి ఉందని తెలిపారు. 4 వేల దుకాణాలకు కంప్యూటీకరణ పూర్తియిందని చెప్పారు. వచ్చే నెల నాటికి మిగిలిన మద్యం దుకాణాలు కంప్యూటీకరణ చేసుకోవాలని సూచించారు. లేదంటే మద్యం సరఫరా నిలిపివేస్తామని ముఖేష్‌ కుమార్‌ మీనా హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement