శ్రీమఠంలో సినీ నటుడు లారెన్స్‌ | lawrence in srimatham | Sakshi
Sakshi News home page

శ్రీమఠంలో సినీ నటుడు లారెన్స్‌

Feb 25 2017 10:04 PM | Updated on Sep 5 2017 4:35 AM

శ్రీమఠంలో సినీ నటుడు లారెన్స్‌

శ్రీమఠంలో సినీ నటుడు లారెన్స్‌

శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ హీరో, దర్శకుడు రాఘవలారెన్స్‌ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి మంత్రాలయం వచ్చారు.

మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ హీరో, దర్శకుడు రాఘవలారెన్స్‌ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి మంత్రాలయం వచ్చారు. ముందుగా వారు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టారు. రాఘవేంద్రస్వామి మూలబృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రథయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు పంచముఖి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు తల్లి కల్మణి, తమ్ముడు ఎల్విన్‌విన్‌ పాల్గొన్నారు. లారెన్స్‌ మాట్లాడుతూ దాదాపు 420 చిత్రాలకు నృత్య దర్శకుడిగా, 10 చిత్రాలకు దర్శకుడిగా, 16 చిత్రాల్లో నటుడిగా పనిచేసినట్లు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement