డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు చివరి అవకాశం | last chance apply to degree entrance | Sakshi
Sakshi News home page

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు చివరి అవకాశం

Jul 23 2016 8:18 PM | Updated on Sep 4 2017 5:54 AM

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం చివరి దశ ఆన్‌లైన్‌ ప్రవేశాలను ఈ నెల 25నుంచి 30వ తేది వరకు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి శనివారం తెలిపారు.

తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం చివరి దశ ఆన్‌లైన్‌ ప్రవేశాలను ఈ నెల 25నుంచి 30వ తేది వరకు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి శనివారం తెలిపారు. ఇప్పటి వరకు దోస్త్‌ (డీవోఎస్‌టీ) వెబ్‌ సైట్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోని వారు సైతం ఈ నెల 25 నుంచి 30వరకు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మొదటి, రెండవ దశల్లో పేర్లు నమోదు చేసుకున్న వారు పై తేదిల్లో వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఆగస్ట్‌ 2వ తేదిన సీట్ల కెటాయింపు ఉంటుందని, 4వ తేదిన సంబంధిత కళాశాలల్లో అభ్యర్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement