కుట్టే వారేరి! | KUTTE VAARERI! | Sakshi
Sakshi News home page

కుట్టే వారేరి!

May 24 2017 2:00 AM | Updated on Sep 5 2017 11:49 AM

కుట్టే వారేరి!

కుట్టే వారేరి!

ప్రభుత్వ పాఠశాలలు మరో 20 రోజుల్లో తెరుచుకోనున్నాయి. జిల్లాలోని 48 మండలాల్లో 1నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య...

నల్లజర్ల : ప్రభుత్వ పాఠశాలలు మరో 20 రోజుల్లో తెరుచుకోనున్నాయి. జిల్లాలోని 48 మండలాల్లో 1నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 2,17,137. ఒక్కొక్కరికీ రెండు జతల చొప్పున 4,34,274 జతల ఏకరూప దుస్తుల(యూనిఫామ్‌)ను పంపిణీ చేయాల్సి ఉంది. వీటిలో 7 మండలాలకు సంబంధించి సుమారు 40 వేల మంది విద్యార్థుల కోసం 80 వేల జతల ఏకరూప దుస్తులకు సరిపోయే వస్త్రం మాత్రమే వచ్చింది. కత్తిరించి పంపించిన ఈ క్లాత్‌ను టైలర్ల చేత కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేయాల్సి ఉంది. జతకు రూ.50 చొప్పున కుట్టు కూలీ చెల్లించనున్నారు. 48 మండలాలకు గాను 7 మండలాల విద్యార్థులకు మాత్రమే క్లాత్‌ వచ్చిందని.. మిగిలిన మండలాలకు ఎప్పటికి వస్తుందో తెలియదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. టైలర్లు దొరక్క అవస్థలు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. బడులు తెరిచే నాటికి క్లాత్‌ రావటం.. యూనిఫామ్‌ కుట్టించడం కష్టసాధ్యమని చెబుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement