ఎన్నికల షెడ్యూల్ ప్రకారం బుధవారం కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు ఓటర్ల ముసాయిదా జాబితాను నగరపాలక కార్యాలయంలో ప్రదర్శించారు.
కర్నూలు ఓటర్ల ముసాదా జాబితా సిద్ధం
Feb 16 2017 12:17 AM | Updated on Aug 14 2018 5:56 PM
కర్నూలు (టౌన్): ఎన్నికల షెడ్యూల్ ప్రకారం బుధవారం కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు ఓటర్ల ముసాయిదా జాబితాను నగరపాలక కార్యాలయంలో ప్రదర్శించారు. నగరంలోని 51 వార్డులను 413 బ్లాకులుగా విభజించిన అధికారులు ఓటర్ల పేర్లు, కులాలను క్షుణంగా పరిశీలించి వాటిని మార్కింగ్ చేశారు. కులాల వారీగా ఓటర్లను గుర్తించే ప్రక్రియ పూర్తి కావడంతో వీటికి సంబంధించిన అభ్యంతరాలను ఈనెల 20 వ తేదీ వరకు నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకురావచని కమిషనర్ తెలిపారు. కార్యాలయంలో అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 28వ తేదీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. వచ్చేనెల 1వ తేదీ ఓటర్ల జాబితాను మున్సిపల్ పరిపాలన శాఖకు పంపిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Advertisement
Advertisement