6న ఆర్‌.కృష్ణయ్య రాక | krishnaiah came on 6th | Sakshi
Sakshi News home page

6న ఆర్‌.కృష్ణయ్య రాక

Nov 5 2016 12:00 AM | Updated on Sep 4 2017 7:11 PM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఈ నెల 6వ తేదీన కర్నూలుకు రానున్నట్లు బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాంబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(అర్బన్‌): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఈ నెల 6వ తేదీన కర్నూలుకు రానున్నట్లు బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాంబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగర శివారులోని వెంగన్నబావి వద్ద ఉదయం 11 గంటలకు కార్తీక మాస వసభోజన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.  కార్యక్రమానికి జిల్లాలోని బీసీ వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించామన్నారు. కార్తీక మాసంలో వివిధ కులాలకు చెందిన వనభోజనాలు జరగడం సాంప్రదాయమని, బీసీల్లోని అన్ని కులాలకు చెందిన నేతలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగానే తొలి సారి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement