'ఆ నీళ్లు ఎందుకూ పనికి రావటం లేదు' | kotamreddy sridhar reddy raise water issue in assembly | Sakshi
Sakshi News home page

'ఆ నీళ్లు ఎందుకూ పనికి రావటం లేదు'

Sep 3 2015 11:18 AM | Updated on Jul 23 2018 6:55 PM

'ఆ నీళ్లు ఎందుకూ పనికి రావటం లేదు' - Sakshi

'ఆ నీళ్లు ఎందుకూ పనికి రావటం లేదు'

నెల్లూరు నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన సమ్మర్ స్టోరేజీ నీళ్లు ఎందుకూ పనికిరావడం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శాసనసభ దృష్టికి తెచ్చారు.

హైదరాబాద్: నెల్లూరు నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన సమ్మర్ స్టోరేజీ నీళ్లు ఎందుకూ పనికిరావడం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శాసనసభ దృష్టికి తెచ్చారు. జీరో అవర్ లో ఆయనీ అంశాన్ని లేవనెత్తారు. రూ.140 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు నుంచి వస్తున్న నీళ్లతో నెల్లూరు రూరల్ ఏరియాలోని దక్షిణంవైపు ఉన్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ నీళ్లు నెల్లూరు ప్రజలు తాగడానికి కాదు కదా ఎందుకూ పనికి రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చర్మవ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు.

లక్ష మందిని ఇబ్బంది పెడుతున్న ఈ సమస్యను పరిష్కరించాలని తమ జిల్లా మంత్రిని కోరామని వెల్లడించారు. 11 నెలలు గడిచినా ఇప్పటికి సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయాలని చేతులెత్తి నమస్కరించి ప్రభుత్వాన్ని కోరారు. శ్రీధర్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నను నోట్ చేసుకున్నామని, సంబంధిత మంత్రితో చెప్పి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement