కొమురవెల్లిలో భక్తుల సందడి | Komuravellilo devotees thronging | Sakshi
Sakshi News home page

కొమురవెల్లిలో భక్తుల సందడి

Oct 10 2016 12:32 AM | Updated on Sep 4 2017 4:48 PM

కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లిలో భక్తుల సందడి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మల్లన్నను దర్శించుకుని పూజలు చేశారు.

చేర్యాల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొం ది. ఆదివారం తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మల్లన్నను దర్శించుకుని పూజలు చేశారు. అలా గే ఆలయంలోని గంగిరేగు చెట్టు కింద పట్నాలు వేసి, స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, కొంత మంది భక్తులు శ్రీమల్లికార్జునస్వామి, బలిజమేడలాదేవికి, గొల్లకేతమ్మకు  ఓడిబియ్యం పోశారు. భక్తుల రద్దీ  ఎక్కువగా ఉండడంతో స్వామివారిని దర్శిం చుకునేందుకు సుమారు గంట సమయం పట్టింది. ఇదిలా ఉండగా,  ఆలయ అధికారులు భక్తుల సౌకర్యాలను  ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement