కొమ్ముచిక్కాలలో చోరీ | kommuchikkalalo chori | Sakshi
Sakshi News home page

కొమ్ముచిక్కాలలో చోరీ

Jun 11 2017 9:59 PM | Updated on Sep 5 2017 1:22 PM

కొమ్ముచిక్కాలలో చోరీ

కొమ్ముచిక్కాలలో చోరీ

పోడూరు : మండలంలోని కొమ్ముచిక్కాలలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది.

పోడూరు : మండలంలోని కొమ్ముచిక్కాలలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు సుబ్బలక్ష్మి తాటాకింట్లో నివసిస్తోంది. ఆమె భర్త కొంతకాలంగా గల్ఫ్‌లో ఉంటున్నాడు. శనివారం ఆమె జిన్నూరులో ఉంటున్న సోదరి ఇంటికి వెళ్లింది. అదేరోజు రాత్రి ఆమె తిరిగొచ్చేసరికి  ఇంటితాళం పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్టు గుర్తించింది. దొంగలు బీరువా పగులగొట్టి అందులో ఉన్న రెండున్నర కాసుల బంగారు నగలు చోరీ చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement