చట్టాలపై అవగాహన అవసరం | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Published Sun, Aug 7 2016 5:30 PM

మాట్లాడుతున్న సంగారెడ్డి మొబైల్‌ కోర్ట్‌జడ్డి దుర్గా ప్రసాద్‌

  • మొబైల్‌ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్‌
  • పటాన్‌చెరు టౌన్‌: విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరమని మొబైల్‌ కోర్టు జడ్జి, ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ దుర్గాప్రసాద్‌ అన్నారు. పటాన్‌చెరు మండల పరిధిలోని బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. స్పెషల్‌ మొబైల్‌ కోర్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. 

    బాలికలు, మహిళలపై  దాడులు, అఘాయిత్యాలు జరిగినా, వరకట్న వేధింపులు, బాలకార్మికులను పనిలో పెట్టుకున్నట్లు తెలిసినా వెంటనే చైల్డ్‌ లైన్‌ నం. 1098కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి రత్నం, చైల్డ్‌లైన్‌ డైరెక్టర్‌ ఎమ్‌.ఎస్‌చంద్ర  బాలల హక్కులు,  పరిరక్షణ, బాలల చట్టాలపై ప్రసంగించారు. జిల్లా ప్రొబేషన్‌ అధికారి సంగమేశ్వర్‌,  ఏఎస్సై దేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గురుకుల పాఠశాల ప్రాగణంలో జరిగిన ఫ్రెండ్‌షిప్‌ డే వేడుకల్లో సంగారెడ్డి మొబైల్‌ కోర్టు జడ్జి దుర్గా ప్రసాద్‌ పాల్గొని, పలువురు విద్యార్థుల చేత ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ కట్టించుకున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement