రేపటి నుంచి సెలవులో జేసీ దివ్య! | kmm jc divya leave from tommarow! | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి సెలవులో జేసీ దివ్య!

Aug 9 2016 10:22 PM | Updated on Sep 4 2017 8:34 AM

ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌ డి.దివ్య

ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌ డి.దివ్య

జాయింట్‌ కలెక్టర్‌ దేవరాజన్‌ దివ్య సెలవుపై వెళ్లనున్నట్లు తెలిసింది. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవుపై వెళ్తున్నట్లు సమాచారం.

ఖమ్మం జెడ్పీసెంటర్‌ : జాయింట్‌ కలెక్టర్‌ దేవరాజన్‌ దివ్య సెలవుపై వెళ్లనున్నట్లు తెలిసింది. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవుపై వెళ్తున్నట్లు సమాచారం. తిరిగి ఆమె 15వ తేదీన విధుల్లో చేరి.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ మేరకు కలెక్టర్‌ లోకేష్‌కుమార్, సీఎస్‌లకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా దివ్య వ్యవహరిస్తున్నారు. గతనెల 31 నుంచి ఈనెల 8వ తేదీ వరకు సెలవులో ఉన్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌  మంగళవారం విధుల్లో చేరారు. పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించిన జేసీ 11వ తేదీ నుంచి సెలవులో ఉండనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement