తెలంగాణ భవన్లో గురువారం పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.
	హైదరాబాద్: తెలంగాణ భవన్లో గురువారం పార్టీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు,  ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి,  తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తదితరులు హాజరయ్యారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
