ఖమ్మం సాగునీటి వ్యవస్థకు మెరుగులు | kcr plans to modify khammam irrigation system | Sakshi
Sakshi News home page

ఖమ్మం సాగునీటి వ్యవస్థకు మెరుగులు

Aug 14 2015 4:06 AM | Updated on Aug 15 2018 9:30 PM

ఖమ్మం సాగునీటి వ్యవస్థకు మెరుగులు - Sakshi

ఖమ్మం సాగునీటి వ్యవస్థకు మెరుగులు

ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకూ చేసిన పనులను ఉపయోగించుకుంటూనే ఖమ్మం జిల్లా సాగునీటి వ్యవస్థను మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

   రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
 సాక్షి, హైదరాబాద్: ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకూ చేసిన పనులను ఉపయోగించుకుంటూనే ఖమ్మం జిల్లా సాగునీటి వ్యవస్థను మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.  జిల్లా లో ప్రతి అంగుళానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని సూచిం చారు. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌లకు ఇప్పటికే రూ.1,800 కోట్లతో పనులు చేసినా పెద్దగా సాగునీరు అందలేదన్న ఆయన.. జిల్లాలో ఇకపై సాగునీటి కోసం చేసే పనులు ప్రణాళికాబద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుతమున్న ప్రాజెక్టుల ద్వారా ఎంతవరకు సాగునీరు అందించవచ్చో అంచనా వేసి, మిగతా భూములకు ఏ మార్గం ద్వారా నీరందించాలనే అంశమై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో సాగునీటి అవకాశాలు, భవిష్యత్తులో చేయాల్సిన పనులపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జెడ్పీ చైర్‌పర్సన్ కవిత, ఎమ్మెల్యేలు మదన్‌లాల్, కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

జిల్లాలో అటవీ ప్రాంతం పోగా 13 లక్షల ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా ఉందని, అందులో ఐదారు లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. సాగునీటి సౌకర్యం లేని తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్- అర్బన్, కామెపల్లి, టేకులపల్లి, కారెపల్లి, ఏలేరుపాడు, జూలూరుపాడు, ముల్కలపల్లి, అశ్వరావుపేట, దమ్మపేట, సత్తుపల్లి తదితర మండలాలకు నీరందించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలకు గోదావరి నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొం దించాలని ఆదేశించారు. కిన్నెరసాని ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. గోదావరి ద్వారా ఎక్కువ ప్రాం తానికి సాగునీరు అందించే అవకాశాలున్నా, గత పాలకులు సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో గడ్డు పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement