'అయుత చండీయాగానికి అందరూ ఆహ్వానితులే' | KCR inspects arrangements for 'Ayutha Maha Chandi Yagam' | Sakshi
Sakshi News home page

'అయుత చండీయాగానికి అందరూ ఆహ్వానితులే'

Dec 18 2015 1:36 PM | Updated on Aug 15 2018 9:30 PM

'అయుత చండీయాగానికి అందరూ ఆహ్వానితులే' - Sakshi

'అయుత చండీయాగానికి అందరూ ఆహ్వానితులే'

విశ్వక్షేమం కోసమే అయుత చండీయాగం నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.


మెదక్ : విశ్వక్షేమం కోసమే అయుత చండీయాగం నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో చండీయాగం కోసం చేపట్టిన పనులను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కేసీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ... అయుత చండీయాగం డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యలతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారని చెప్పారు. ఈ యాగానికి 40 వేల మందిని ఆహ్వానించామని పేర్కొన్నారు. ప్రతిరోజు 50 వేల మందికి ప్రసాదము, భోజనం అందజేస్తామన్నారు.

అయితే ఈ యాగానికి వచ్చే భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. చండీయాగానికి అందురూ ఆహ్వానితులే అని చెప్పారు. చండీయాగానికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించానని... ఆయన వచ్చే విషయంపై స్పష్టత మాత్రం ఇవ్వలేదని కేసీఆర్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement