భక్తులకు శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారి చీరలు | kameswaridevi sarees for devotees | Sakshi
Sakshi News home page

భక్తులకు శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారి చీరలు

Nov 5 2016 9:58 PM | Updated on Sep 4 2017 7:17 PM

వేలాలు నిర్వహిస్తున్న అధికారులు

వేలాలు నిర్వహిస్తున్న అధికారులు

మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి అలంకరించిన చీరలను శనివారం వేలాల ద్వారా భక్తులకు అందజేశారు.

– వారంలో మూడు రోజుల పాటు వేలాలు
 
మహానంది: మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి అలంకరించిన చీరలను శనివారం వేలాల ద్వారా భక్తులకు అందజేశారు. సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు 60 చీరలను వేలాల ద్వారా విక్రయించగా రూ.30వేల ఆదాయం వచ్చినట్లు ప్రొటోకాల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ప్రతి శని, ఆది, సోమవారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు విక్రయాలు కొనసాగిస్తామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement