breaking news
kameswaridevi
-
భక్తులకు శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారి చీరలు
– వారంలో మూడు రోజుల పాటు వేలాలు మహానంది: మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి అలంకరించిన చీరలను శనివారం వేలాల ద్వారా భక్తులకు అందజేశారు. సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు 60 చీరలను వేలాల ద్వారా విక్రయించగా రూ.30వేల ఆదాయం వచ్చినట్లు ప్రొటోకాల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ప్రతి శని, ఆది, సోమవారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు విక్రయాలు కొనసాగిస్తామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
నిజరూపంలో కామేశ్వరీదేవి
మహానంది: తొమ్మిదిరోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చి విశేష పూజలందుకున్న శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు సోమవారం నిజరూపంలో దర్శనమిచ్చారు. దేవస్థానం ఈఓ డాక్టర్ శంకర వరప్రసాద్ ఆధ్వవర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, శాంతారాంభట్, నాగేశ్వరశర్మ, జ్వాలా చక్రవర్తి, తదితర పండిత బృందం విశేష పూజలు నిర్వహించారు. రాత్రి మయూర వాహనంపై కొలువైన అమ్మవారిని గ్రామోత్సవం నిర్వహించారు.స్థానిక స్వామివారి అలంకార మండపంలో శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి సహస్రదీపాలంకరణ సేవలు వైభవంగా జరిగాయి. నంద్యాలకు చెందిన విద్యార్థిని ప్రదర్శించిన భరతనాట్యం ¿భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో విద్యుత్ ఏఈ ప్రభాకర్‌రెడ్డి, దాతలు గంగిశెట్టి మల్లికార్జున, హైకోర్టు న్యాయవాది గంగిశెట్టి రాజేశ్, సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.