ఎవడబ్బ సొమ్మనీ..! | kabja | Sakshi
Sakshi News home page

ఎవడబ్బ సొమ్మనీ..!

Mar 15 2017 12:04 AM | Updated on Mar 25 2019 3:09 PM

ఎవడబ్బ సొమ్మనీ..! - Sakshi

ఎవడబ్బ సొమ్మనీ..!

భద్రాద్రి దేవస్థానంకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 1347.27 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1032.94 ఎకరాలు ఏపీలోనే ఉంది. సుమారు 1207.29 ఎకరాలు ప్రస్తుతం ఆక్రమణలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భూములను సాగు చేస్తున్న 410 మందిని గుర్తించి, వారి నుంచి ఆలయాధికారులు యూజ్‌ అండ్‌ ఆక్యుపేష¯ŒS చార్జెస్‌ కింద కౌలు వసూలు చేస్తున్నారు. ఇలా ఏడాదికి సుమారు రూ.20 లక్షలు కౌలు రూపేణా ఆలయానిక

 
భద్రాద్రి దేవస్థానం భూములపై బడాబాబులు కన్నేశారా..? ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నం భూములపై ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది పెత్తందారులు పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారా..? పురుషోత్తపట్నం కేంద్రంగా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఇది నిజమేనంటున్నారు. కౌలు భూముల్లో దేవస్థానం నుంచి ఎటువంటి అనుమతుల్లేకుండానే చేపల చెరువు నిర్మాణం చేపడుతుండటం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. – నెల్లిపాక
 
భద్రాద్రి దేవస్థానంకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 1347.27 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1032.94 ఎకరాలు ఏపీలోనే ఉంది. సుమారు 1207.29 ఎకరాలు ప్రస్తుతం ఆక్రమణలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భూములను సాగు చేస్తున్న 410 మందిని గుర్తించి, వారి నుంచి ఆలయాధికారులు యూజ్‌ అండ్‌ ఆక్యుపేష¯ŒS చార్జెస్‌ కింద కౌలు వసూలు చేస్తున్నారు. ఇలా ఏడాదికి సుమారు రూ.20 లక్షలు కౌలు రూపేణా ఆలయానికి ఆదాయం రావాల్సి ఉంది. ఇలా సాగు చేస్తున్న వారికి భూములపై ఎటువంటి హక్కులు ఉండవు. ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు చేయాల్సిందే. ఒకటి రెండు చోట్ల మినహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భూములకు భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పేరుతోనే సర్వ హక్కులు(పట్టా) ఉన్నాయి.
సేద్యం పేరుతో వ్యాపారం
ఏళ్ల తరబడి సాగు చేస్తున్న కొంతమంది సేద్యం పేరుతో రాముడి భూములతో వ్యాపారాలు చేస్తున్నారు. పురుషోత్తపట్నంలోని ఓ వ్యక్తి సుమారు అర ఎకరంలో ఏకంగా చేపల చె రువు నిర్మాణం చేపట్టారు. నిబంధనల మేరకు ఈ భూముల్లో పంటలు వేయాల్సి ఉంటుంది. వీటితో ఎటువంటి వ్యాపారా లు చేయకూడదు. కానీ కౌలు చెల్లిస్తున్నామనే కారణంతో చేప ల చెరువు నిర్మాణం చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అంతేగాక చెరువు మట్టిని భద్రాచలం పట్టణానికి తరలించి ఒక్కో ట్రాక్టర్‌ మట్టి రూ.600లకు విక్రయిస్తూ, పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నప్పటకీ, దేవస్థానం అధికారులు కానీ రెవెన్యూ శాఖ కానీ పట్టించుకోకపోవటంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భూముల స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకని దేవస్థానం ద్వారా నియమితులైన రక్షణ సిబ్బందికి చేపల చెరువు నిర్మాణం, మట్టి వ్యాపారాలు వారి దృష్టికి రాలేదా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. 
పురుషోత్తపట్నం కేంద్రంగా అక్రమ వ్యాపారాలు
భద్రాచలంనకు ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నం కేం«ద్రంగా కొంతమంది బడాబాబులు అక్రమ వ్యాపారాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొల్లుగూడెం రీచ్‌ నుంచి ఇసుకను రా త్రి వేళ తరలిస్తూ, పురుషోత్తపట్నం సమీపంలోని దేవస్థానం భూముల్లో నిల్వ చేసి, దానిని భద్రాచలం పట్టణానికి తరలిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించకపోతే రాములోరి భూముల్లో అక్రమాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భక్తులు అంటున్నారు. 
 
పోలీసులకు ఫిర్యాదు చేశాం
పురుషోత్తంపట్నం ఆలయ భూముల్లో గోతులు తవ్విన కౌలుదారునిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మట్టి అమ్మకాలు చేపట్టినట్లుగా మా విచారణలో తేలింది. భూమిలో గుంతలు పెట్టినందుకు గాను డామేజ్‌ చార్జి వసూలు చేస్తాము. అదే విధంగా అతని ఆధీనంలో ఉన్న పది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని, తిరిగి వేలం నిర్వహిస్తాము.  
– రమేష్‌బాబు, దేవస్థానం ఈవో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement