ఇంటర్నేషనల్‌ క్లబ్‌ డైరెక్టర్‌గా జొన్నలగడ్డ నాగరాజు | jonnagadda nagaraju as international director | Sakshi
Sakshi News home page

ఇంటర్నేషనల్‌ క్లబ్‌ డైరెక్టర్‌గా జొన్నలగడ్డ నాగరాజు

Jan 25 2017 12:13 AM | Updated on Sep 5 2017 2:01 AM

వాసవీ క్లబ్‌ 209లో ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌గా జొన్నలగడ్డ నాగరాజును ఎన్నుకున్నారు.

నూనెపల్లె: వాసవీ క్లబ్‌ 209లో ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌గా జొన్నలగడ్డ నాగరాజును ఎన్నుకున్నారు. డిసెంబర్‌ 28వ తేదీన బెంగుళూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ క్లబ్‌ ఎన్నికల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోగా జనవరి 21న విశాఖపట్నంలో నిర్వహించిన సమావేశంలో ఆయనకు పిన్‌ కేటాయించారు. ఇంటర్నేషనల్‌ క్లబ్‌ 22 మంది డైరెక్టర్లు ఉండగా కర్నూలు జిల్లా నుంచి ఆయనకు చోటు కల్పించారు. 2017 చివరి వరకు క్లబ్‌ డైరెక్టర్‌గా ఉంటారు.  ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. తాను నిర్వహించిన పలు సేవా కార​‍్యక్రమాలను గుర్తించి డైరెక్టర్‌గా అవకాశం కల్పించారని చెప్పారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement