పీఎస్‌ఎల్‌వీ-సీ28 రాకెట్ ను ప్రయోగించిన ఇస్రో | isro launches pslvc 28 | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఎల్‌వీ-సీ28 రాకెట్ ను ప్రయోగించిన ఇస్రో

Jul 10 2015 10:01 PM | Updated on Sep 3 2017 5:15 AM

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ28 రాకెట్‌ను శుక్రవారం రాత్రి 9.58 గంటలకు ప్రయోగించారు.

శ్రీహరికోట(సూళ్లూరుపేట):  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ28 రాకెట్‌ను శుక్రవారం రాత్రి  9.58 గంటలకు ప్రయోగించారు.  అంతరిక్ష వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఐదు బ్రిటన్ ఉపగ్రహాలను నింగికి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ28 రాకెట్ ప్రయోగానికి గత రెండు రోజుల క్రితమే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.  బుధవారం మొదటి దశలో రాకెట్ లో ఘన ఇంధనం నింపగా, గురువారం ఉదయం నుంచి రాకెట్‌లోని సాంకేతిక వ్యవస్థలను పరీక్షించారు.

విపత్తుల నిర్వహణ, భూ ఉపరితల పరిశీలన, వనరుల అధ్యయనం కోసం గాను బ్రిటన్‌కు చెందిన సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్(ఎస్‌ఎస్‌టీఎల్) రూపొందించిన ఐదు ఉపగ్రహాలను ఈ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ సీ28 రాకెట్ నింగికి చేర్చనుంది. ఉపగ్రహాల మొత్తం బరువు 1440 కిలోలు. ఇంత బరువుగల ఉప గ్రహాలను రోదసిలోకి తీసుకెళ్లడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి.

Advertisement
 
Advertisement
Advertisement