10న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–17 ప్రయోగం | GSLV F-17 Launch on june 10th | Sakshi
Sakshi News home page

10న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–17 ప్రయోగం

May 23 2026 4:20 AM | Updated on May 23 2026 4:20 AM

GSLV F-17 Launch on june 10th

ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–17 ఉపగ్రహ వాహకనౌక

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జూన్‌ 10వ తేదీన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–17 ప్రయోగాన్ని నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా 1,117 కిలోలు బరువు కలిగిన ఈవోఎస్‌–05 (జీఐశాట్‌–1ఏ) అనే భూ పరిశీలన ఉపగ్రహా న్ని నింగిలోకి పంపనున్నారు.

అయితే ఈ ప్రయోగం మార్చి నెల నుంచి వాయిదా పడుతూ వస్తోంది. వరుసగా రెండు పీఎస్‌ ఎల్‌వీ ప్రయోగాలు విఫలమైన తర్వాత చేపట్టనున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–17 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించాలని శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా దృష్టిసారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement