విధుల నుంచి ఇన్విజిలేటర్ల తొలగింపు | invigilators prohibits | Sakshi
Sakshi News home page

విధుల నుంచి ఇన్విజిలేటర్ల తొలగింపు

Mar 18 2017 11:26 PM | Updated on Sep 5 2017 6:26 AM

గుత్తిలోని మోడల్‌ పాఠశాలలో శుక్రవారం పదోతరగతి తెలుగు-1 పరీక్షలో ఇద్దరు విద్యార్థులకు 01టీ బదులు 03టీ ప్రశ్నపత్రాలు అందజేసిన ఇన్విజిలేటర్లు పెద్దన్న, జోహార్‌బానును పరీక్ష విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ వేణుగోపాల్‌ శనివారం తెలిపారు.

గుత్తి : గుత్తిలోని మోడల్‌ పాఠశాలలో శుక్రవారం పదోతరగతి తెలుగు-1 పరీక్షలో ఇద్దరు విద్యార్థులకు 01టీ బదులు 03టీ ప్రశ్నపత్రాలు అందజేసిన ఇన్విజిలేటర్లు పెద్దన్న, జోహార్‌బానును పరీక్ష విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ వేణుగోపాల్‌ శనివారం తెలిపారు. ఇన్విజిలేటర్లు 01టీకు బదులు 03 టీ ఇవ్వడం వల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు ఇన్విజిలేటర్లను శనివారం రిలీవ్‌ చేశారు. వారిపై పరీక్షల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంఈఓ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement