సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షల్లో చాట్‌జీపీటీపై నిషేధం

CBSE prohibits use of ChatGPT in class 10, 12 board exams - Sakshi

న్యూఢిల్లీ: 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌జీపీటీ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) అధికారులు మంగళవారం ప్రకటించారు. ఈ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొబైల్‌ ఫోన్లు, చాట్‌జీపీటీ యాక్సెస్‌ ఉన్న పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు చెప్పారు.

పరీక్షల్లో చాట్‌జీపీటీ ఉపయోగించడం అంటే అనైతిక పద్ధతులు అనుసరించినట్లేనని అన్నారు. సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలను నమ్మొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఐ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీ (చాట్‌ జనరేటివ్‌ ప్రి–ట్రెయిన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌) గత ఏడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top